Former Minister Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్‌తో భేటీ

కేసీఆర్‌తో భేటీ

Update: 2025-09-06 10:45 GMT

Former Minister Harish Rao: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం వంటి అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News