Kaleshwaram Project: ఎన్డీఎస్ఎ (NDSA) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫార్సు
సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫార్సు
By : PolitEnt Media
Update: 2025-09-02 09:03 GMT
Kaleshwaram Project: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఎ) నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేస్తూ కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఎ), కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మాణం, నాణ్యత, డిజైన్, ప్రణాళికలో లోపాలున్నాయని ప్రభుత్వం పేర్కొంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా విచారణలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. అసెంబ్లీ లో ఎన్డీఎస్ఎ నివేదిక పైన కూడా చర్చించామని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. గతంలో రాష్ట్రానికి సీబీఐ రాకుండా ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది.