Illegal Drug : మేడ్చల్ జిల్లాలో మాదకద్రవ్యాల తయారీ యూనిట్ రహస్యం బట్టబయలు.
మాదకద్రవ్యాల తయారీ యూనిట్ రహస్యం బట్టబయలు.
By : PolitEnt Media
Update: 2025-09-06 11:09 GMT
Illegal Drug : మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో డ్రగ్స్ తయారీ యూనిట్‌ను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. దాడులు చేసి 32 వేల లీటర్ల ముడి సరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందిని అరెస్టు చేశారు. మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ (ఎండీఎంఏ) ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో ఈ డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టనున్నారు. నిందితులను ముంబయికి తరలించనున్నట్లు సమాచారం.