CM Revanth Reddy: నేను ఎవరి వెనకాలేను-సీఎం రేవంత్ రెడ్డి
ఎవరి వెనకాలేను-సీఎం రేవంత్ రెడ్డి
By : PolitEnt Media
Update: 2025-09-03 10:26 GMT
CM Revanth Reddy: కేసీఆర్‌ను, వారి పార్టీని ప్రజలు తిరస్కరించారని, అలాంటి వారి వెనుక నేను ఎందుకుంటాను అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఆమె వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు.
హరీష్‌రావు,సంతోష్ రావు వెనుక నేనున్నానని కొందరు. కవిత వెనకాల ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనకాలేను. వారిని ప్రజలు తిరస్కరించారు. అలాంటి వారితో కలిసే అవసరం నాకు లేదు, సమయం లేదు. నేను ప్రజల వెంట మాత్రమే ఉంటాను. మీ కుల, కుటుంబ పంచాయతీల మధ్య మమ్మల్ని తీసుకురావద్దు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.