Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు మార్గం సుగమం!
కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు మార్గం సుగమం!
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు అవకాశం లభించే అవకాశాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలతో మంగళవారం జూమ్ సమావేశం నిర్వహించి, ఈ ఉప ఎన్నికపై చర్చించారు.
ఈ సమావేశంలో నవీన్ యాదవ్‌పై ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో, జూబ్లీహిల్స్ అభ్యర్థి రేసులో ఉన్న బొంతు రామ్మోహన్ తప్పుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని, పార్టీ గెలుపు కోసం తాను కృషి చేస్తానని బొంతు రామ్మోహన్ తెలిపారు.
సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఉప ఎన్నికకు సంబంధించిన సర్వే నివేదికలు, అభ్యర్థుల సామాజిక నేపథ్యాలపై విస్తృత చర్చ జరిగింది. రెండు పేర్లను ఏఐసీసీకి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.