Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: గులాబీ పార్టీ చిరునామా మార్పు- మంత్రి పొన్నం

గులాబీ పార్టీ చిరునామా మార్పు- మంత్రి పొన్నం

Update: 2025-10-14 09:28 GMT

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గూబ గుయ్యిమనేట్లు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా చిరునామా గల్లంతవుతుందని జోస్యం చేశారు. ముఖ్యంగా, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జూబ్లీహిల్స్‌లో ఏ అభివృద్ధి జరిగిందో ప్రజలు చర్చించి, తీర్పు వేయాలని సవాల్ విసిరారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ, "అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చి, బుద్ధి చెప్పారు. కంటోన్‌మెంట్ ఉపఎన్నికల్లో కూడా ఆ పార్టీకి తగిన పాఠం చెప్పారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు (ఫేక్ వోట్లు) నమోదు చేసుకోవడానికి బీఆర్‌ఎస్, భాజపా కలిసి కుట్ర పన్నుతున్నారు. మాగంటి సునీతతో కన్నీరు పెట్టించి, గులాబీ పార్టీ  ఓట్లు దండుకోవాలని చూస్తోంది" అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ ఉపఎన్నిక ప్రజలు పార్టీల అవినీతి, అణచివేతలకు వ్యతిరేకంగా ఓటు వేసి, నిజమైన మార్పుకు మద్దతు చూపాల్సిన అవకాశమని పొన్నం పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం పెరగడం వంటి అంశాలను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News