Kadiyam Srihari: కడియం శ్రీహరి : కేసీఆర్ ఉన్నంతవరకే బీఆర్ఎస్‌లో హరీష్

బీఆర్ఎస్‌లో హరీష్

Update: 2025-11-27 13:52 GMT

Kadiyam Srihari: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ పర్యటన సందర్భంగా కేటీఆర్ తనపై చేసిన టార్గెటెడ్ వ్యాఖ్యలకు గట్టి రిప్లై ఇచ్చిన శ్రీహరి, కేటీఆర్ రాజకీయ దారి, నాయకత్వ లోపాలు, పార్టీ ఫిరాయింపులపై ధాటిగా ప్రశ్నించారు. 'కేసీఆర్ లేకపోతే నీ గుర్తింపు ఎక్కడిది? నిన్ను అడిగేవారు ఎవరు?' అంటూ కేటీఆర్‌ను సూటిగా ఎదుర్కొన్నారు.

కేటీఆర్ విమర్శలకు శ్రీహరి గట్టి కౌంటర్

వరంగల్ పర్యటనలో కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రత్యుత్తరంగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'నేను దమ్ము ఉన్న నాయకుడిని. నువ్వు మాదిరిగా అయ్య అండ చూసుకొని రాజకీయాలు చేయట్లేదు' అంటూ కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. తనకు కుటుంబ రాజకీయాలు లేవని, స్వతహగా ఎదిగిన నాయకుడని గర్వంగా చెప్పుకున్న శ్రీహరి, కేటీఆర్ విలువలు, నీతి గురించి మాట్లాడటాన్ని ఎండిపోసారు. 'గత పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఈ విలువలు ఎక్కడికి పోయాయి? ఆ రోజు కేసీఆర్ తప్పు అని ఎందుకు చెప్పలేదు?' అంటూ ఘాటైన ప్రశ్నలు వేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని స్పష్టం చేశారు.

హరీష్ రావు భవిష్యత్‌పై సంచలన ప్రకటన

కేటీఆర్ నాయకత్వంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన శ్రీహరి, 'కవిత కేటీఆర్ దగ్గర పని చేయలేకపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి బయటపడ్డారు' అంటూ ఆరోపించారు. కేటీఆర్‌ను 'ఐరన్ లెగ్'గా సూచించి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతని నాయకత్వంలో పని చేయలేకపోతున్నారని విమర్శించారు. మరింత సంచలనంగా, 'కేసీఆర్ ఉన్నంత వరకే హరీష్ రావు బీఆర్ఎస్‌లో ఉన్నారు. తర్వాత అతడి మార్గం అతడిదే' అంటూ హరీష్ రావు భవిష్యత్‌పై హింట్ ఇచ్చారు. పార్టీ శ్రేణులకు కేటీఆర్ నాయకత్వం పనికిరాదని తెలుసని, ఇకనైనా అహంకారం, బలుపుతో మాట్లాడటం మానేయాలని హితవు పలికారు. 'పెద్ద నాయకునివి కావాలంటే బలుపు, అహంకారం తగ్గించుకోవాలి' అంటూ సూచనలు చేశారు.

ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త చర్చలకు దారితీశాయి. కడియం శ్రీహరి రాజకీయ దారి, కేటీఆర్ నాయకత్వంపై ఈ ఘాటైన విమర్శలు పార్టీ ఐక్యతకు సవాలుగా మారతాయా అనేది ఆసక్తికరంగా ఉంది.

Tags:    

Similar News