Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఎక్స్‌’ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

‘‘నేను మీ పార్టీలో ఓ అవినీతిపరుడిని విమర్శిస్తే కొన్ని గంటల్లోనే నన్ను సస్పెండ్‌ చేశారు. మరి మీరు అదే అవినీతిపరుడితో ఉంటూ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం, ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పుపట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా?’’ అని కవిత ప్రశ్నించారు.

‘‘మీ వ్యవహారాలతో పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా? ఆ అవినీతిపరుడి మాయలో పడిపోయి పెద్ద మనిషినే తప్పుపడుతున్నారు. పార్టీలో మీ వైఫల్యాన్ని భారాస అధినేతపై మోపుతున్నారంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?’’ అని కూడా ఆమె అన్నారు.

కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో అంతర్గత ఘర్షణలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. కేసీఆర్‌ నిర్ణయాలపై విమర్శలు చేస్తూ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్న కవిత మాటలు పార్టీలోని వివిధ వర్గాల్లో ఆందోళన కలిగించాయి.

Tags: