Harish Rao: బీఆర్‌ఎస్‌కు కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు

కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు

Update: 2025-09-05 08:56 GMT

Harish Rao: బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆరే అధినేత అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయాలు అధినేత  కేసీఆరే తీసుకుంటారని ఆయన అన్నారు. లండన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్‌ తనకు నేర్పిన పాఠమని ఆయన తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగినందుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ రాద్ధాంతం చేస్తోందని హరీష్‌రావు విమర్శించారు. గత ఏడాదిన్నరగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఆయన సూచించారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిందని, ఎన్నారైలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు గుప్పించారు.

Tags:    

Similar News