Harish Rao: నాపై ఆరోపణలను వారి వివేకానికి వదిలేస్తున్నాను: హరీశ్‌రావు
వారి వివేకానికి వదిలేస్తున్నాను: హరీశ్‌రావు
By : PolitEnt Media
Update: 2025-09-06 05:39 GMT
Harish Rao: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తనపై ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. తాను 25 ఏళ్లుగా ఉద్యమంలో ఉంటూ తన ప్రస్థానం పారదర్శకంగా ఉందని తెలిపారు. "ఇటీవల నాపై, మా పార్టీపై కొందరు ఆరోపణలు చేశారు. అవి ఎందుకు చేశారు? ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకు చేశారు? ఈ ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. గత పదేళ్లుగా కేసీఆర్ నిర్మించిన ప్రతి వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు సరికాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా ప్రధాన కర్తవ్యం" అని హరీశ్‌రావు అన్నారు.