KTR Revanth Reddy : మేడిగడ్డ బ్యారేజి మీద చర్చిద్దాం రా…!
సీయం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే కూలిపోయిందంటున్న మేడిగడ్డ బ్యేరేజీ మీదనే చర్చించుకుందాం రావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి గట్స్ ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. చర్చకు రా అని సవాల్ విసిరి తీరా చర్చకు వెళితే రేవంత్ రెడ్డి పారిపోయాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజిపైకి వెళ్లి వచ్చి మరీ ఈ సవాల్ విసిరారని దమ్ముంటే రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు మీము విసిరిన సవాల్ స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల చివరి మడి వరకూ నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డికి తెలిసి కూడా అబద్దాలు మాట్లాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. సీయం రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నన్ను కోసుకు తింటారా అని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ అన్నారు. రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు ఏం పీక్కుంటారో చూపిస్తారని కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో తిట్లు వాడటం మాకు ఇష్టం లేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుందని, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు మేము కూడా తిట్లు వాడటం తప్పడం లేదని కేటీఆర్ చెప్పారు.