MLC Kavitha: సంచలన నిర్ణయం దిశగా ఎమ్మెల్సీ కవిత..!
ఎమ్మెల్సీ కవిత..!
MLC Kavitha: భారాస నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం కవిత మీడియా ముందుకొస్తారని, తన భవిష్యత్ కార్యాచరణను మీడియా ముఖంగా ప్రకటిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు.
గత కొద్ది కాలంగా కవిత ప్రవర్తన తీరు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందంటూ భారాస అధిష్టానం మంగళవారం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు భారాస అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయకముందే ఎమ్మెల్సీ పదవికి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని యోచనలో కవిత ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.
లిక్కర్ స్కాంలో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినప్పట్నుంచి పార్టీ కి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ వస్తున్న కల్వకుంట్ల కవిత, కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూ వచ్చిన కవిత,అదే పేరుతో గాని..ఇంకొక పేరుతో గాని కొత్త పార్టీ పెట్టాలని. భావిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా సన్నాహాలు కూడా ప్రారంభించారని సమాచారం. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో కొత్త పార్టీ వ్యవహారంలో కవిత మరింత స్పీడ్ పెంచనున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.