Kavitha: సీఎం సొంత జిల్లాలోనూ పెండింగ్ ప్రాజెక్టులు.. కవిత తీవ్ర విమర్శ
కవిత తీవ్ర విమర్శ
Kavitha: ఎల్నినో హెచ్చరికలు 10 నెలల ముందు నుంచే వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి రైతులను పంటలు వేయవద్దని కోరుతున్నారని ఆమె ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 30 నెలలు దాటినా ఇంకా పాత ప్రభుత్వాన్నే తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం సొంత జిల్లా పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని కవిత ప్రశ్నించారు. మిషన్ భగీరథను పూర్తి స్థాయిలో నిర్వహించి ఇంటింటికీ నీరు అందించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తారా.. లేక పాత ప్రభుత్వాన్నే తిట్టుకుంటూ గడిపేస్తారా? అని సవాలు విసిరారు.
తోడబుట్టిన వారిని కూడా కిరాయి మనుషులతో తిట్టిస్తున్న వ్యక్తి కేటీఆర్ అని ఆమె మండిపడ్డారు. ఎర్రవల్లి ఫామ్హౌస్కు మోటార్లతో నీరు తరలిస్తున్నారో లేదో తెలియదని, చాలా మంది ఎమ్మెల్యేల పొలాలకు మోటార్లు ఉన్నట్లు తెలిసిందని కవిత వ్యాఖ్యానించారు.