Minister Ponguleti: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలి: మంత్రి పొంగులేటి

రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలి: మంత్రి పొంగులేటి

Update: 2025-12-29 13:08 GMT

Minister Ponguleti: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆశయాలను సాకారం చేసే దిశగా రెవెన్యూ శాఖ ఉద్యోగులు కృషి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఉద్యోగి పనితీరు ఉండాలని ఆయన సూచించారు.

సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రెవెన్యూ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) తరఫున నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు.

గత ఏడాది రైతుల భూ సమస్యల నివారణకు భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల రెవెన్యూ సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయని, కేంద్రీకృత వ్యవస్థను వికేంద్రీకరణ చేశామని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో రైతులకు సేవలు అందేందుకు గ్రామ పాలన అధికారులను (జీపీఓ) నియమించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ నాయకులు జయశ్రీ, రాంబాబు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News