Arrests of Sub-Registrars: సబ్రిజిస్ట్రార్లపై అక్రమ అరెస్టులు ఆపాలి: టీజీఓ నేతలు డీజీపీకి వినతి
డీజీపీకి వినతి
Arrests of Sub-Registrars: రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో సబ్రిజిస్ట్రార్లు, సిబ్బందిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం మానుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) నేతలు డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి కోరారు.
బుధవారం డీజీపీకి వినతిపత్రం అందజేస్తూ, చట్టపరిధిలో పనిచేస్తున్న రిజిస్ట్రేషన్ అధికారులకు తగిన రక్షణ కల్పించాలని, అక్రమ కేసులు బనాయించకుండా సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని టీజీఓ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, కోశాధికారి సామల సహదేవ్‌తో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.
అదే రోజు ఉద్యోగుల పీఆర్సీ అమలు, పెండింగ్ సమస్యలపై టీఎన్జీఓ నేతలు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లను కలిసి చర్చించారు. టీఎన్జీఓ స్పోర్ట్స్ మీట్‌కు ఎల్బీ స్టేడియం కేటాయించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి కోరారు. ఈ సమావేశాల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ పాల్గొన్నారు.