Tensions in Nalgonda: నల్గొండలో ఉద్రిక్తత: మంత్రి కోమటిరెడ్డి పర్యటనలో భాజపా-కాంగ్రెస్‌ వర్గీయుల ఘర్షణ

భాజపా-కాంగ్రెస్‌ వర్గీయుల ఘర్షణ

Update: 2025-09-05 08:38 GMT

Tensions in Nalgonda: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన సందర్భంగా నల్గొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఒకటో నంబర్ వినాయక విగ్రహం వద్ద శుక్రవారం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడుతుండగా, దేవుడి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడుతున్నారని భాజపా నేతలు నిరసన తెలిపారు. వేదికపై తమను కూర్చోనివ్వకపోవడంపై భాజపా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఈ నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగిన నేపథ్యంలో పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని సంఘటనా స్థలం నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తర్వాత మంత్రి కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News