Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమీషన్ ముందు హాజరైన కేసీఆర్

కమీషన్ ముందు హాజరైన కేసీఆర్;

Update: 2025-06-11 06:50 GMT

Kaleshwaram Commission:భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, కెసీఆర్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్,ఆనకట్టల నిర్మాణం,ఒప్పందాలు,కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు తొమ్మిది మంది నేతలకు బీఆర్కే భవన్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటి వరకు 114 మందిని విచారించింది. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ హరీశ్ రావు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News