TPCC Chief Mahesh Kumar Goud: వారి అవినీతి సంపద వాటాలతో మాకు సంబంధం లేదు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
మాకు సంబంధం లేదు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
By : PolitEnt Media
Update: 2025-09-02 12:59 GMT
TPCC Chief Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ కావడం ఆ పార్టీ అంతర్గత విషయమని, దానిపై స్పందించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. గతంలో తాను చెప్పినట్లు ఆస్తులు, వాటాల్లో తగాదాలున్నాయన్నారు. ఆ తగాదాలే సస్పెన్షన్‌కు దారి తీసి ఉండొచ్చన్నారు.
"మేము ఎవరో వెనక ఉండాల్సిన అవసరం లేదు. మా సీఎంకి, మా పార్టీకి ఒకరి వెనక ఉండాల్సిన అవసరంలేదు. కొందరు కవిత వెనుక ఉన్నామని, మరికొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నామని అంటున్నారు. కానీ మేం ప్రజల వెంటే ఉన్నాం. ప్రజలు మాతో ఉన్నారు. అవినీతి ఊబిలో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయింది. వారికి అవినీతి సంపద వాటాల విషయంలో తగాదా వచ్చినట్లుంది. ఆ వాటాలతో మాకు సంబంధం లేదు." అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.