అమెరికాలో రాజకీయ హత్యలు.. డెమొక్రాట్లపై కాల్పులు

Shootings at Democrat leaders in America

Update: 2025-06-15 08:13 GMT

అమెరికాలో ఇద్దరు డెమోక్రాట్ నేతలపై కాల్పులు జరిగాయి. మిన్నెసోటాకు చెందిన సెనేటర్ జాన్ హోఫ్మ్యన్, రిప్రజంటేటివ్ మెలిస్సా హర్ట్మ్యన్లపై వారి ఇళ్లల్లో ఈ దాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో మెలిస్సా, తన భర్త ప్రాణాలు కోల్పోయారు. జాన్ హోఫ్మ్యాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుడు పోలీసు యునిఫాంలో వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఇంటి ముందు దుండగుడు నిలిపిన కార్లో చట్టసభల పేర్లతో కూడిన చీటీ పోలీసులకు దొరికింది. వాటితో పాటు నో కింగ్స్ పేరుతో కూడిన కరపత్రాలు లభించాయి. కాల్పుల నేపథ్యంలో మిన్నెసోటీలో ర్యాలీలు ప్రదర్శనలు నిలిపివేశారు.

Tags:    

Similar News