బదిలీలు, కీలక మార్పులు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బదిలీలపై గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేసి, బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం:

తితిదే ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ నియమితులయ్యారు.

ప్రస్తుత ఈవో శ్యామలరావు జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు.

రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు.

రెవెన్యూ, ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్‌ మీనా.

మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్‌ శ్రీధర్‌.

అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే.

గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌.

కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌.

ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌.

పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు.

రెవెన్యూ (ఎండోమెంట్‌) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌ నియమితులయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story