జనసేన విచారణ కమిటీ నియమితం

Jana Sena Appoints Inquiry Committee: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఒక మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోపణలపై సమగ్ర విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ సభ్యులుగా ఉన్నారు.

ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు మరియు ఆ మహిళ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోపు హాజరై తన వివరణ ఇవ్వాలని పార్టీ స్పష్టం చేసింది. విచారణ పూర్తయి నివేదిక సమర్పించే వరకు ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం త్వరగా స్పందించి నిజా నిజాలు తేల్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై పార్టీ తుది నిర్ణయం కమిటీ నివేదిక ఆధారంగా తీసుకుంటుందని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story