అచ్చెన్నాయుడ్ని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని పేరాడ తిలక్ డిమాండ్‌

రైతుల పనిముట్లలోనూ అవినీతికి పాల్పడుతున్న అచ్చన్నాయుడు

వ్యవసాయ శాఖలో మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న అవినీతిపై బహిరంగ దర్యాప్తు చేపట్టి, సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైయస్సార్సీపి టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. బుధవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. రైతులకు సబ్సిడీపై అందజేసే వ్యవసాయ పనిముట్లు లోను అచ్చెన్నాయుడు తన ఓఎస్డి పోలి నాయుడు తో అవినీతికి పాల్పడుతున్నారని తిలక్‌ విమర్శించారు. పనిముట్లు తయారు చేసే కంపెనీలతో మధ్యవర్తిత్వం వ్యవహరించి డబ్బులు వసూలు చేయాలని ఆగ్రో జిఎం పై ఒత్తిడి తీసుకువచ్చి ఆ పని చేయలేను అన్న జిఎంను నెల్లూరు బదిలీ చేశారని ఆరోపించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్న అచ్చం నాయుడు రైతులని నిలువెత్తున ముంచుతూ రైతుకు రావలసిన సబ్సిడీలో అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దర్యాప్తు చేయించి మంత్రివర్గం నుంచి అచ్చెన్నాయుడ్ని భర్తరఫ్ చేయాలని తిలక్‌ డిమాండ్ చేశారు. 2018లో తితిలి తుఫాను వలన నష్టపోయిన రైతాంగానికి ఇన్సూరెన్స్ ను తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోగా రైతాంగానికి 2019లో ఇన్సూరెన్స్ సబ్సిడీ అందజేసి ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదని తిలక్‌ చెప్పారు. నందిగాం మండలంలో నిర్మాణం పూర్తయిన విత్తనోత్పత్తి కేంద్రానికి మిగతా సదుపాయాలు కల్పించి దానిని ప్రారంభించేందుకు వ్యవసాయ మంత్రిగా ఉన్న అచ్చన్నాయుడు నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నా యూరియా పంపిణీకి నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తిలక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టెక్కలిని జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చిన అచ్చెన్నాయుడు నేడు ఎందుకు ఆ ప్రతిపాదన చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రైతులకు ఉచిత పంటల భీమా ప్రీమియం ప్రభుత్వమే భరించాలని వైఎస్‌ఆర్‌సీపీ పేరాడ తిరల్‌ డిమాండ్ చేశారు.

Updated On 20 Aug 2025 4:03 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story