కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకపోతే ఎంత!’

Anam’s Sharp Remark: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ విమర్శలు వినడం బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడును ప్రపంచమంతా స్టేట్స్‌మెన్‌గా కీర్తిస్తోంది. ఆయన సుపరిపాలన కేసీఆర్‌కు నచ్చితే ఎంత.. నచ్చకపోతే ఎంత’ అని ఆయన ధ్వజమెత్తారు.

గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్‌ సిక్స్‌ హామీలతో అద్భుతమైన పరిపాలన అందించి సూపర్‌హిట్‌ సాధించిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గత ప్రభుత్వం మాటలకే పరిమితమైతే.. కూటమి ప్రభుత్వం చట్టసభల్లో బిల్లు ఆమోదించి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు.

ఆలయాల పరిరక్షణ, దేవాదాయ శాఖ సంస్కరణలపైనా మంత్రి ఆనం స్పష్టత ఇచ్చారు. ‘ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా పూజలు నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలను సరిదిద్దాం. దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టాం. వేద విద్యను ప్రోత్సహిస్తున్నాం’ అని తెలిపారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైందని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story