Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో ఈ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్ల మంజూరు చేయడం ప్రధాన అజెండాగా ఉంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు రూ.1,811.81 కోట్లతో చేపట్టేందుకు అనుమతులు ఇవ్వనున్నారు.

విశాఖపట్నంలో ఎన్‌ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు, పర్యాటక పాలసీలో భాగంగా కాన్సర్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకురావడం వంటి అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్‌ఎఫ్‌డీబీకి రాజధానిలో భారీ అక్వేరియం, కార్యాలయం ఏర్పాటు, ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ వంటి సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

సమావేశంలో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, తప్పుడు ప్రచారాలపై కీలక చర్చ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించవద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

కులపరమైన అంశాలు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా స్ప్రెడ్ చేస్తున్నారని సీఎం ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖ కలిసి పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సైబర్ క్రైమ్ సమస్యల పరిష్కారం కోసం ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు సోషల్ మీడియాలో నేతలను కించపరుస్తూ వచ్చే వీడియోలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైకాపా వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని నేతలకు సీఎం సూచించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలను కూడా సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story