AP Budget 2026–27: ఏపీ బడ్జెట్ 2026-27: రూ.3,32,205 కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

AP Budget 2026–27: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ అంటే కేవలం సంఖ్యల సమాహారం కాదని, రాష్ట్రాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే సంకల్పమని వివరించారు. జోడెద్దుల బండి లాగా రెండింటినీ సమతుల్యంగా నడిపించాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపొందించబడిందని తెలిపారు.
ఈ బడ్జెట్ మొత్తం వ్యయం రూ.3,32,205 కోట్లుగా ఉంది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేయబడింది. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ రంగాల్లో సమతుల్య కేటాయింపులు చేపట్టారు.
బడ్జెట్‌లో ముఖ్యాంశాలు:
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయింపు.
విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు.
రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.13,546 కోట్లు.
పరిశ్రమల రంగానికి రూ.3,161 కోట్లు.
సర్దుబాటు నిధికి రూ.1,500 కోట్లు.
వీబీ జీ రామ్ జీ (VB G RAM-G)కు రూ.8,365 కోట్లు.
గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు.
ఎన్టీఆర్ వైద్య సేవలకు రూ.4,000 కోట్లు.
జల్ జీవన్ మిషన్‌కు రూ.4,000 కోట్లు.
స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు.
విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు (పది జిల్లాల పరిధిలో).
అమరావతి ఆర్థిక ప్రాంతానికి 9 జిల్లాలతో కలిపి ప్రత్యేక కేటాయింపులు.
రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు.
ఈ బడ్జెట్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణలను సమన్వయం చేస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, అప్పుల భారాన్ని తగ్గించడం, పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఆశాజ్యోతిని అందిస్తుందని అంచనా వేయబడుతోంది.

