AP Cabinet: ఏపీ క్యాబినెట్: రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

శుద్ధ ఇంధనం, ఎనర్జీ రంగాల్లో అగ్రస్థానం లక్ష్యం
AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 40కి పైగా అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. శుద్ధ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో క్యాబినెట్ ముఖ్యమైన చర్యలు తీసుకుంది.
ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికను ఆమోదించారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కొత్త పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్నూలు విమానాశ్రయాన్ని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనపై చర్చించారు.
వివిధ సంస్థలకు భూముల కేటాయింపులు, ఎంఎస్‌ఎంఈలకు నిధుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సాగునీటి కాలువల విస్తరణ, రోడ్లు, పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపైనా మంత్రివర్గం విస్తృత చర్చ నిర్వహించింది.
ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి మైలురాయి అని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

