AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ కేబినెట్ భేటీ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, గల్లంతైన జాలర్ల గాలింపుపై కీలక నిర్ణయాలు
జాలర్ల గాలింపుపై కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు ప్రధాన అజెండాగా ఉంది. దాదాపు 55కు పైగా అంశాలపై చర్చ జరుగుతోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గం కీలకంగా చర్చించనుంది. కేబినెట్ భేటీ అనంతరం బీసీలకు స్థానిక సంస్థల్లో 33.50 శాతం, పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయనున్నారు. బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై లోతైన చర్చ జరుగుతోంది. కమిషన్ నివేదికను అమలు చేస్తే 34 శాతం రిజర్వేషన్ వీలు కాదని, ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానానికి కూడా నేడు మంత్రివర్గ ఆమోదం తెలపనున్నారు.
ఇదే సమయంలో కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆచూకీ లభించే వరకు గాలింపును ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు ఓడలరేవు జెట్టీ నుంచి చేపల వేటకు వెళ్లిన బోటు, ఉదయం 11 గంటల వరకు కుటుంబసభ్యులతో ఫోన్ సంబంధం ఉండగా, ఆ తర్వాత సమాచారం అందలేదు. బోటులో వీహెచ్‌ఎఫ్ సెట్, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 12వ తేదీ నాటికి తిరిగి రావాల్సిన బోటు రాకపోవడంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. కోస్ట్‌గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి, కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా సమాచారం సేకరించేందుకు అప్రమత్తం చేశారు.
బాధిత కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, అన్ని మార్గాలను వినియోగించి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇలా రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజల సమస్యలపై సమాంతరంగా దృష్టి సారిస్తూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
- ChandrababuNaiduCMChandrababuAPCabinetAPCabinetMeetingAndhraPradeshAPGovernmentAPPoliticsBCReservationsBCReservationBCQuota34PercentReservationBackwardClassesBCWelfareSocialJusticeFishermenMissingFishermenFishermenSearchFishermenRescueSearchOperationFisheriesDepartmentAPFisheriesWelfareSchemesGovernmentDecisionsCabinetDecisionsTDPTeluguDesamPoliticalNewsAPNewsLatestAPNewsLatestPoliticalNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

