పలు కీలక నిర్ణయాలు

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో వివిధ రంగాల అభివృద్ధి, ప్రాజెక్టులు, పాలసీలపై చర్చించి ఆమోదం తెలిపారు.
ప్రధాన నిర్ణయాలు:
అమరావతి ఐ ప్రాజెక్టు: కృష్ణా నదీ తీరంలో ఏర్పాటు చేస్తున్న ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
రిజర్వాయర్లలో కేజ్ కల్చర్: ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాకు ఆమోదం. మడ్డువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి.
ఏపీ ఏవియేషన్ పాలసీ-2026: కొత్త ఏవియేషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ: కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు.
మానవ అవయవాల మార్పిడి చట్టం: అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రతిపాదనకు ఆమోదం.
బీచ్ షాక్స్: విశాఖపట్నం, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు గ్రీన్ సిగ్నల్.
సాగునీటి ప్రాజెక్టులు: పోలవరం సహా వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులకు పరిపాలనా అనుమతులు.
రుణ హామీ: హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ హామీ.
పదవీ విరమణ వయసు: ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం.
వీబీ-జీ-రాంజీ: జులై 1 నుంచి అమలుకు మంత్రివర్గ ఆమోదం.
భూ కేటాయింపులు: పలు సంస్థలకు భూముల కేటాయింపులకు అంగీకారం.
ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఊతమవుతాయని, ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచుతాయని మంత్రివర్గం భావిస్తోంది.

