పలువురు మంత్రులు అధికారులతో భేటీ అవనున్న ఏపీ సీయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అవుతారు. విభజన అంశాలకు సంబంధించిన పలు విషయాలపై ఏపీ సీయం ఆయనతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి నివాసం 1జనపథ్‌ లో నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకేసారస్వత్‌ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ లో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుపై సీయం చంద్రబాబు ఢిల్లీ మెట్రో ఎండీతో చర్చిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మూర్తి మార్గ్‌-3లో దివంగత ప్రధానమంత్రి పీవీనరసింహారావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు, అలాగే రాత్రి 7గంటలకు కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ తో సమావేశం అవుతారు. రాత్రి ఢిల్లోనే బసచేసి 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియాతో భేటీ అవుతారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ సీయం సమావేశం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. 16వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు 17 వ తేదీ గురువారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story