వారుసుల పేరు మీద ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌

వారసత్వంగా వచ్చే భూములు ఇకపై సునాయాశంగా వారసుల పేరు మీద బదలాయించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. ఈ కొత్త నిబంధన ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరుగుతాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100, ఆపైన ఉంటే రూ.1,000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద కట్టాలి.

నూత నిబంధన ప్రకారం తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు ఇప్పుడు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవడానికి, మ్యుటేషన్‌ల కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. గత ఏడాదిలో సుమారు 55 వేల ఫిర్యాదులు మ్యుటేషన్‌ల ఆలస్యంపై ప్రభుత్వానికి అందాయి. ఈ కొత్త విధానంతో ఆ సమస్య పరిష్కారం కానుంది.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటికే మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం ఆస్తులను వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే, అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌లు ఎలా చేయాలన్న దానిపై డిజిటల్‌ అసిస్టెంట్లకు కూడా మరోదఫా శిక్షణ ఇవ్వనున్నారు.

రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు అంటే మ్యుటేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. వారసులకు ఈ-పాస్‌బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్న వారి నుంచి ఈ-కేవైసీ సైతం తీసుకుంటారు.

Updated On 9 July 2025 10:43 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story