AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం: చెవిరెడ్డి కంపెనీలపై సిట్ దూకుడు
చెవిరెడ్డి కంపెనీలపై సిట్ దూకుడు

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వస్తున్న లిక్కర్ కుంభకోణంపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) దూకుడు చూపిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో సిట్ బృందాలు విస్తృత సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుబంధ సంస్థలు కీలకంగా మారాయి.చిత్తూరులో మోహిత్ రెడ్డికి చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలో సిట్ తనిఖీలు జరుపుతుండగా, బీవీ రెడ్డి కాలనీ, నలందా నగర్, నిఖిలానంద అపార్ట్‌మెంట్లలోని కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు.
అలాగే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్‌లో ఫ్లాట్ నం. 35లో ఉన్న మోహిత్ రెడ్డి అనుబంధ సంస్థలోనూ సిట్ తనిఖీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఈ దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని సంస్థలు పేర్లుగా మాత్రమే ఉండి, వాస్తవంగా పనిచేయకపోవడం, రికార్డుల్లో వేరు–ప్రాక్టీసులో వేరు పేర్లు ఉండటం సిట్ దృష్టికి వచ్చింది. నిందితుల లింకులను ఒక్కొక్కటిగా వెలికితీయడంతో, ఈ స్కాంలో ఉన్న అసలు బండారం సిట్ బహిర్గతం చేస్తోంది.
