AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం: రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
లిక్కర్ స్కామ్ మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్ (సూత్రధారి) రాజ్ కెసిరెడ్డే అని సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టిగా వ్యాఖ్యానించింది. ఆయన తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభించగానే కోర్టు జోక్యం చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడంతో రాజ్ కెసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ధర్మాసనం ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. కెసిరెడ్డి తరఫు న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు అందుకు అనుమతి తెలిపింది.
ఈ కేసులో రాజ్ కెసిరెడ్డి కేంద్ర బిందువుగా ఉన్నారని, షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

