మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ

Lokesh Meets Modi: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సహకారం అందించాలని లోకేశ్‌ ప్రధానిని కోరారు. సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాల కోసం కేంద్రం సహకారం కావాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 15 నెలల్లో కేంద్ర సహకారంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలను లోకేశ్‌ వివరించగా, రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను లోకేశ్‌ మోదీకి బహుకరించారు.

లోకేశ్‌ ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. గతంలో మే 17న తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లతో మోదీని కలిసిన లోకేశ్‌, నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ ప్రధానిని కలవడం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story