APPSC : ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్లు.. 892 పోస్టుల భర్తీకి అవకాశం
అవకాశం

APPSC : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ శాఖల్లో మొత్తం 892 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో 163 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఉంది. వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
గ్రూప్-1లో భర్తీ చేయనున్న పోస్టులు:
డిప్యూటీ కలెక్టర్లు - 11,
ఏపీ టాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు - 14,
డీఎస్పీ సివిల్ - 36,
డీఎస్పీ కమ్యూనికేషన్స్ - 3,
డీఈవోలు - 14,
ఆర్టీవోలు - 3,
జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు - 1,
డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సర్వీసెస్ - 15,
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 - 12,
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ - 2,
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ - 3,
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 14,
డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 35.
గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మిగిలిన 729 పోస్టులకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలు, పరీక్షల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మరో 5 విభాగాల పోస్టులకు బుధవారం, మరో 10 విభాగాలకు ఈ నెల 24న నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

