నా జీవితంలో ప్రేరణను నింపారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: టీచర్లను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ‘‘పిల్లల్లో స్ఫూర్తి కలిగించేది, మన నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని.. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటాను. రాజకీయ నాయకుల పిల్లలు సాధారణంగా చదువుకోరు. లోకేశ్ చదువు విషయంలో నా భార్యే చూసుకుంది.. ఆ క్రెడిట్ ఆమెదే. డీఎస్సీలో జాప్యం చేయను.. సమయానికి భర్తీ చేస్తాను. టీచర్ల బదిలీలు గతంలో జడ్పీ ఛైర్మన్ చేతిలో ఉండేవి. కౌన్సిలింగ్ ప్రక్రియను తెచ్చింది నేనే. కొన్ని ఉద్యోగాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. తల్లికి వందనం పథకంతో పిల్లల చదువుకు అండగా ఉన్నాం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం’’ అని అన్నారు.

‘‘భారత్‌లోని కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోవడం, పిల్లల కోసం కష్టపడటం ఇక్కడే కనిపిస్తాయి. ఈ విలువలు కాపాడుకుంటే పిల్లలు ఏదైనా సాధిస్తారు. నేను ఉండగా ఉద్యోగులకు ఇబ్బంది రాదు.. రానివ్వను. ఉద్యోగుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం నా బాధ్యత. వాట్సప్ గవర్నెన్స్‌తో 700 సేవలు అందిస్తున్నాం. టీచర్లు సిలబస్‌ను రీరైట్ చేసుకోవాలి. పిల్లలకు అవసరమైన సిలబస్‌ను రివైజ్ చేయాలి. టెక్నాలజీలో నేటి పిల్లలు చాలా వేగంగా ఉన్నారు. సమాజ మార్పులకు అనుగుణంగా కరిక్యులమ్ ఉండాలి. ఉపాధ్యాయులు నిత్యం అప్‌డేట్ కావాలి. పిల్లల్లో సృజనాత్మకత పెంచడం గురువుల బాధ్యత’’ అని చెప్పారు.

ఐఐటీ కోచింగ్‌లో చుక్కా రామయ్య కచ్చితంగా ఉండేవారని, పదివేల దరఖాస్తుల్లో వందమందిని ఎంపిక చేసి అందరినీ ఐఐటీకి పంపేవారని, సిఫారసు చేసినా సీటు ఇవ్వబోమని చెప్పేవారని, అందుకే ఆయనపై గౌరవం పెరిగిందని సీఎం తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story