వికసిత్ భారత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి

Chief Minister Nara Chandrababu Naidu: భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ భాజపా అని కొనియాడారు.

మన సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలను భాజపా బలోపేతం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాజపా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కూడా భాజపా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ను బలమైన దేశంగా మార్చడంలో భాజపా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఏపీకి ఆ పార్టీ అందిస్తున్న స్థిరమైన మద్దతు ఎంతో విలువైందని అన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story