సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్‌: ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక శక్తివంతమైన వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు శక్తివంతులుగా మారారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టితో అనేక సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. కోవిడ్ కాలంలో 100 దేశాలకు వ్యాక్సిన్లు అందించిన ఘనత మోదీకి దక్కిందని వివరించారు. మన దేశంలో తయారైన ఉత్పత్తులను విదేశాలు ఉపయోగించే స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు.

‘‘అద్భుతమైన ఆవిష్కరణలు విపరీతంగా వస్తున్నాయి.. ఎవరూ అడ్డుకోలేరు. 2010లో 4జీ, 2020లో 5జీ సేవలు ప్రవేశపెట్టాం.. 2030 నాటికి 6జీ వస్తుంది. ప్రతి దశాబ్దానికి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మరింత విస్తరించాయి. ప్రైవేటు సంస్థలకు పోటీగా మెరుగైన సేవలు అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రధాని క్వాంటమ్ మిషన్‌ను ప్రవేశపెట్టారు. మొదటి క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి వస్తుంది. సురక్ష, భద్రత కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరం. మోదీ నాయకత్వంలో క్రమబద్ధంగా పనిచేస్తున్నాం. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మరిన్ని కొత్త ఆవిష్కరణలు రావాలి’’ అని చంద్రబాబు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story