BTech Ravi: పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. తనను డబ్బుతో కొనడం అవినాష్ రెడ్డికి కాదు, ఆయన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మంగళవారం కడపలో విలేకర్ల సమావేశంలో బీటెక్ రవి మాట్లాడుతూ, అవినాష్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు.

“డబ్బు మీద మీకున్న వ్యామోహం, కక్కుర్తి నాకు లేదు. అది మీ సోదరులకు మాత్రమే ఉంది” అని బీటెక్ రవి ఎద్దేవా చేశారు.

బీటెక్ రవి ముఖ్య ఆరోపణలు:

అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వకపోతే రూ.15 కోట్లు ఇస్తామని అవినాష్ రెడ్డి తనకు ఆఫర్ చేశారని ఆరోపించారు.

విజయ సాయి రెడ్డిని కలిసిన విషయంపై గత ఆరేళ్లుగా అవినాష్ రెడ్డి ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.

2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఉల్లిమెళ్లలో తన తోట వద్దకు పిలిచి కసునూరు ఎంపీటీసీ అంశంపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కేసును ఉపసంహరించుకోవడానికి తనకు, ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్ ఆఫర్ చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ క్యాంపుల్లో అసంతృప్తుల వివరాలు తమకు అందించింది అవినాష్ రెడ్డేనని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీబీఎమ్ వర్క్ రద్దు చేయించి రూ.15 కోట్ల కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు.

అరటి రైతులను మోసం చేసి కమీషన్లు తీసుకున్న విషయాన్ని ఎండగట్టారు.

సీఐ రాజేశ్వర్ రెడ్డి, గణకణపల్లి కృష్ణారెడ్డిని అడిగితే అవినాష్ రెడ్డి ఎర్రచందనం దొంగతనాల గురించి వివరిస్తారన్నారు.

ఉల్లిమెళ్ల తోటలో ఏమీ జరగలేదని అవినాష్ రెడ్డి చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీటెక్ రవి సవాల్ విసిరారు. “ఇప్పటివరకు పుష్ప-1 మాత్రమే వచ్చింది.. ఇక పుష్ప-2, పుష్ప-3 కూడా చూపిస్తాం” అని అవినాష్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు.

బీటెక్ రవి ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story