Mp Midhun Reddy : రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు – మిథున్ రెడ్డి
సిట్ విచారణకు సహకరిస్తానని మిథున్ ప్రకటన

రాజకీయ ఒత్తిడితోనే తనపై మద్యం కుంభకోణంలో నాపై కేసు పెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. వాస్తవానికి ఏపీలో మద్యం కుంభకోణం కేసు ఎటువంటి ఆధారాలు లేవని మిథున్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ కేసులో నాపై ఎటువంటి ఆధారాలు ఉన్నా చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నేతలందరినీ జైల్లో పెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని మిథున్ రెడ్డి విమర్శించారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా పెడుతున్న కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని మిథున్ రెడ్డి తెలిపారు. తాను సిట్ విచారణకు హాజరవుతానని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. సిట్ అభ్యర్ధనను న్యాయస్ధానం తోసి పుచ్చింది. దీనికి ముందు మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో వేసిన పిటీషన్ను కూడా న్యాయస్ధానం తిరస్కరించింది ఈ నేపథ్యంలో మద్యం కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సిట్ విచారణకు హాజరవడానికి శనివారం మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేశారు.
