MP Sribharat Announces: విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి సంబంధించి మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) ఆమోదం లభించింది.

ఈ మూడు ప్రాజెక్టుల అమలుకు సుమారు రూ.1,501.03 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

మధురవాడ జోన్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి: రూ.658.61 కోట్లు

మధురవాడ జోన్‌లో స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ: రూ.725.18 కోట్లు

బల్క్ & సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ: రూ.117.24 కోట్లు

ఈ ప్రాజెక్టులు విశాఖ పట్టణ మౌలిక సదుపాయాలను మరింత బలపరచడంతో పాటు, నగర ప్రజల జీవన ప్రమాణాలను భారీగా మెరుగుపరుస్తాయని ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యానించారు. డ్రైనేజీ, తాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి, నగరం మరింత ఆధునిక, స్మార్ట్ నగరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story