Dhulipalla Narendra: తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, వైఎస్ జగన్ రక్తంలోనే వెన్నుపోటు ఉందని తీవ్ర విమర్శించారు. అమరావతి, విశాఖ, మావిగన్ అంటూ రాజధాని విషయంలో జగన్ అడుగడుగునా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని ఆయన దుయ్యబట్టారు.

వచ్చే ఎన్నికల్లో ‘మావిగన్’ అంశాన్ని వైకాపా మ్యానిఫెస్టోలో చేర్చుతామని జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్ర తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి స్పందించారు.

“జగన్ లాంటి మారీచుల నుంచి రాజధాని అమరావతిని కాపాడేందుకే కేంద్రం రక్షణ కల్పించింది. జగన్ వెన్నుపోటుకు బొత్స, ధర్మాన తదితర ఉత్తరాంధ్ర నేతలు ఇంకా గొడ్డలి పార్టీలో ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడం లేదు. అధికారం పోయినా అహంకారం పోలేదన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా జగన్ అబద్ధాలు చెప్పుతున్నారు. రాజధాని విషయంలో జగన్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒకే సిద్ధాంతం కలిగి ఉన్నాయి” అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

ఈ సందర్భంగా రాజధాని విషయంలో జగన్ చేసిన ‘నరం లేని నాలుక అబద్ధాలు’ అని వ్యాఖ్యానిస్తూ ఒక వీడియోను కూడా ప్రదర్శించారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Next Story