అభివృద్ధిని వేగవంతం చేస్తున్న చంద్రబాబు: తెలంగాణ మాజీ మంత్రి వ్యాఖ్య

Former Telangana Minister: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఏపీకి లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, చంద్రబాబు దానిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు.

“ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను. గత ఏడాది యూనివర్సిటీల కోసం కోరుకున్నాను. ప్రస్తుతం దేశంలో మూడు పెద్ద డీమ్డ్‌ యూనివర్సిటీలను నడుపుతున్నాను. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ పదేళ్లలో అభూతపూర్వ అభివృద్ధిని సాధించారు. కేటీఆర్‌ హైదరాబాద్‌కు మల్టీనేషనల్‌ కంపెనీలను తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి బాగాలేదు. గతంలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఆస్తులు కొనేవారు. ఇప్పుడు పరిస్థితి తిరిగి మారింది. తెలంగాణ వాసులు ఏపీలో ఆస్తులు కొని, వ్యాపారాలు చేస్తున్నారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణలో పాత రోజులు తిరిగి వస్తాయి,” అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story