Chandrababu Mocks Jagan: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఘాతుకాలు బయటపడడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఎద్దేవా చేశారు.

జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, మిత్రుడు, డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ లక్ష్యంగా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తూ, పని గట్టుకొని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో కులాలు ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారని, అన్ని ఘటనలకు కులం రంగు పూసి రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

ఉద్యోగాలు, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి అంశాలపై కూడా చంద్రబాబు స్పందించారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉండగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,500 మంది యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిందని, అయినా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

హామీ ఇవ్వకపోయినా 10,800 మంది ఉద్యోగులకు సీపీఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చామని, సీమాంధ్రకు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చింది టీడీపీనేనని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌కు వారి పాలనలోనే ఎన్జీటీ స్టే ఇచ్చిందని, ఆ స్టే వెకేట్ చేయించలేని వ్యక్తులు సీమ లిఫ్టు గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

తుంగభద్ర గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఆదాయం తేవాలని రేయింబవళ్లు ఆలోచిస్తుంటే, గొడ్డలి పార్టీ మాత్రం రాత్రీ పగలు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాష్ట్రాన్ని కులం, మతం, వర్గాల వారీగా విడదీసేలా విషం చిమ్ముతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచేలా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story