కుప్పంలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీయం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగుళూరులోని కెంపెగౌడ్ విమనాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2గంటలకు నేరుగా శాంతిపురం మండలం తుమ్శి గ్రామంలో ఉన్న ఏపీమోడల్ స్కూల్ కి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొని పలు సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందజేస్తారు. అనంతరం తిమ్మరాజుపల్లి చేరుకుని అక్కడి ఇంటింటికీ తిరిగి సుపరిపాలనలో తొలిఅడుగు గురించి ప్రజలకు వివరిస్తారు. అనంతరం కడపల్లెలో ఉన్న నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 10.30 గంటలకు కుప్పం ఏరియా ఆసుపత్రిలో టాటా డింక్ సెంటర్ ని ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో యువతకు నైపుణ్య శిక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాలుగు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అలాగే రూ.1617 కోట్ల పెట్టుబడులతో కుప్పంలో పలు కంపెనీ ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోనున్నారు. అనంతరం కడపల్లె నివాసానికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. తిరిగి 4గంటల ప్రాంతంలో బెంగుళూరు బయలుదేరి అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు
