కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్‌పై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ

  • ప్లాంట్ లో 50శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి
  • ఎప్పటి నుంచో పని చేస్తున్న నిర్వాసితులను తొలిగించడకుండా కొనసాగించాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో 50 శాతం ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్టు కార్మికులుగా కల్పించాల్సిదేనని స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే, పాత కాంట్రాక్టు కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు...స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మిక నేతల కుమ్మక్కుతో లేని 2 వేల మంది కాంట్రాక్టు కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని, బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్‌లో నిర్వాసితులు చాలాకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఉపాధి భరోసా పొందేంత వరకు కాంట్రాక్టు విధానంలో ఉపాధి కల్పించాల్సిందేనని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు... స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 1998లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా తెలుగుదేశం పార్టీ కృషి చేసింది..అలాగే 2025లో ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కృషి చేస్తుందని తెలియజేశారు.. గతంలో వెయ్యమంది కాంట్రాక్టులు ఉండేవారు అని, ప్లాంట్ పై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రస్తుతం 42 విభాగాలకు 42 కాంట్రాక్టర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకొంటున్నారని అన్నారు.. దీనిని ప్రైవేటీకరణగా చిత్రీకరించడం తప్పుడు ప్రచారం మాత్రమేనని అన్నారు. గుత్తేదారులు ఈ అంశాన్ని గుర్తుంచుకొని సింగిల్ విండో పద్ధతిలో నిర్వాసితులు, సీనియర్ కాంట్రాక్టు కార్మికులను కొనసాగించాల్సిందేనని గట్టిగా హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు , స్టీల్ ప్లాంట్ నాయకులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story