డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలు స్ఫూర్తిదాయకం

CM Chandrababu's Teacher's Day Wishes: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

సీఎం చంద్రబాబు తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: "భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, గొప్ప ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఈ రోజు, ఆయనకు ఘన నివాళి అర్పించే సందర్భం. ఆయన ఆచరించిన ఆదర్శాలు ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తినిస్తూ, వారిని ఈ వృత్తికి అంకితం చేస్తున్నాయి. విద్యార్థుల మనసుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న ఉపాధ్యాయులందరికీ నా అభినందనలు. అదే అంకితభావంతో మీరు ముందుతరాలకు మార్గదర్శకులుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."

మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

అదే విధంగా, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు కూడా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. "మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకునే మిలాద్ ఉన్ నబీ, ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. అజ్ఞానాన్ని తొలగించి, ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన మహమ్మద్ ప్రవక్త సూత్రాలైన నీతి, నిజాయితీ, ప్రేమ, త్యాగాలను పాటించేందుకు ఈ సందర్భం ప్రేరణ కల్పిస్తుంది. సాటివారిని గౌరవిస్తూ, వారి అవసరాలను తీర్చే పవిత్ర ఆశయాలను కొనసాగించాలని, ఈ దిశలో ముస్లిం సోదరులు ముందుండాలని కోరుకుంటున్నాను" అని సీఎం పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story