CM N. Chandrababu Naidu: ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి నష్టం కలిగించిన వారు, ఇప్పుడు కూడా కుట్రల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం పట్ల ఆసక్తి లేని ఆ పార్టీ విధ్వంసకర ధోరణిని కొనసాగిస్తోందని అన్నారు.

పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, ప్రభుత్వం తీసుకొస్తున్న నిధులు, పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయినప్పటికీ రాష్ట్రంపై విశ్వాసంతో పెట్టుబడులు వస్తున్నాయని, ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రత్యర్థి పార్టీపై వ్యంగ్యంగా స్పందిస్తూ, “ఓసీడీలా ఇప్పుడు సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) అనే వ్యాధి పట్టుకుంది” అని విమర్శించారు. ప్రతి విషయానికీ క్రెడిట్ తమదే అని చెప్పుకునే అలవాటు పెరిగిందని, అలా కొనసాగితే దేశానికి స్వాతంత్ర్యాన్ని కూడా తామే తెచ్చామని చెబుతారని వ్యాఖ్యానించారు.

తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి రాజకీయాలకు ఇక సమయం చెల్లిపోయిందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story