AP Women's Commission: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌కు మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన మహిళా నాయకులు ఈ ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

హోం మంత్రి అనితను ఉద్దేశించి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఒక మహిళా ప్రజా ప్రతినిధి గౌరవాన్ని కించపరచేలా ఉన్నాయని మహిళా నేతలు విమర్శించారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలు, నిర్ణయాలకు మాత్రమే పరిమితం కావాలని, మహిళల వ్యక్తిత్వం, రూపురేఖలు, వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని తెలిపారు.

ఫిర్యాదులో మహిళా కమిషన్ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. మహిళల గౌరవాన్ని కించపరచే వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని, అందిన ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story