Prime Minister’s Visit: ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం సమగ్రంగా పరిశీలించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుండటంతో ఈ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, వాహనాల పార్కింగ్ స్థలాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై మంత్రులు వివరంగా సమీక్షించారు. హోంమంత్రి అనిత అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి, ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ పర్యటన ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయి అవుతుందని, ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story