వైఎస్‌.జగన్‌, బుగ్గనలపై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహనరెడ్డి, మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. ప్రజలపై అవ్యాజమైన ప్రమే ఉన్నట్లు నటిస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రత్నిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. ప్రజలు తమకు ఓటు వేయలేదనే అక్కసుతో సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకునేందుకు వీరిద్దరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్ల రుణం తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జీవో నెం 32 జారీ చేసిందని అప్పటి నుంచి ఏపీకి ఆరుణం మంజూరు కాకుండా విఫల ప్రయత్నం చేశారని అన్నారు. జర్మనీలో విప్రో కంపెనీలో పనిచేస్తున్న ఉదయ భాస్కర్‌ అనే అతనితో బాంబే మార్కెట్‌లో ఉన్న పెట్టుబడిదారులు అందరికీ ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని 200 ఈమెయిల్స్‌ పంపించాడని పయ్యావుల తెలిపారు. వైఎస్‌ఆర్సీపీకి చెందిన రాజ్య సభ సభ్యులు, ఫైనాన్సు స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి, ఆర్.బి.ఐ, సెబీలకి కంప్లైంట్స్ పెట్టించారని, వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో పిల్ వేయించారని ఏపీ మంత్రి కేశవ్‌ వెల్లడించారు. ఇన్ని చేసినప్పటికీ ఆర్బీఐ, సెబీలు క్లియరెన్స్‌ ఇవ్వడంతో పెట్టుబడిదారులు ఓవర్‌ సబ్‌ స్క్రబ్‌ చేశారని పయ్యావుల కేశవ్‌ తెలిపారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్‌ ఎక్కడా తగ్గలేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story